ఏసీబీకి చిక్కిన ఈఎన్సీ కనకరత్నం
NEWS Jul 16,2025 05:03 pm
పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ సోదాలు చేపట్టింది. బుధవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కనక రత్నం. కొన్ని రోజుల క్రితమే పదవి విరమణ చేయగా, ప్రభుత్వం తన పదవీ కాలాన్ని ఒక ఏడాది పాటు పొడిగిస్తూ పోస్టింగ్ ఇచ్చింది. అంతలోనే మనోడు చేతివాటం ప్రదర్శించాడు.