ఢిల్లీలో నీటి వాటాలపై రేవంత్, బాబు భేటీ
NEWS Jul 16,2025 03:41 pm
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం లో ఏపీ, తెలంగాణ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చించారు. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర వివాదం నెలకొంది. దీనిపై ప్రధానంగా చర్చకు వచ్చింది.