తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిట
NEWS Jul 16,2025 08:08 am
భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామిని 73 వేల 20 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 609 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.19 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.