షీ టీమ్స్ ఆధ్వర్యంలో 478 మంది అరెస్ట్
NEWS Jul 16,2025 08:03 am
హైదరాబాద్ లో జరిగిన మొహర్రం, బోనాల పండుగల సందర్బంగా 478 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు మహిళా సెక్యూరిటీ విభాగం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లావణ్య. పట్టుబడిన వారిలో 386 మంది పెద్దలు ఉండగా, 92 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించారు. 288 మందిని హెచ్చరించి విడిచి పెట్టామని, నలుగురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఒకరికి జైలు శిక్ష విధించగా, నలుగురిలో ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున ఫైన్ విధించారన్నారు. ఇప్పటి వరకు 124 చోట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.