IIIT కాలేజీ భూములు పరిశీలన
NEWS Jul 16,2025 06:34 am
కనిగిరి మండలం బల్లిపల్లి గ్రామ శివారులో త్రిబుల్ ఐటీ కాలేజ్ నిర్మాణానికి చెందిన భూములను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి సంబంధించి సేకరించిన భూములను పూర్తిగా చదును చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. త్వరలోనే బల్లిపల్లి వద్ద ట్రిపుల్ ఐటీ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు