పెండింగ్ కేసులపై డీఎస్పీ సమీక్ష
NEWS Jul 16,2025 06:39 am
పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీ లింగయ్య అన్నారు. మక్తల్ సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్సై, సీఐలతో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ల వారిగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, నిందితులకు శిక్షలు పడేవిధంగా చూడాలని అన్నారు. సీఐ రామ్ లాల్, ఎస్సైలు నవీద్, భాగ్యలక్ష్మి రెడ్డి పాల్గొన్నారు.