కస్తూర్బా పాఠశాలను సందర్శించిన కలెక్టర్
NEWS Jul 15,2025 04:48 pm
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పసుపుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నాయా లేదా అని ఎస్వో ను అడిగి తెలుసుకున్నారు. మెనూ బోర్డు చూసి క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. పాఠశాలకు అవసరమయ్యే సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యతో పాటు కరాటే, క్రీడల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.