కోయిల్ సాగర్ నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు
NEWS Jul 15,2025 04:48 pm
కోయిల్ సాగర్ కుడి, ఎడమ కాలువల నుంచి సాగు నీటిని ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్ మండలాల రైతులకు సాగు నీరు అందుతుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.