బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు బాంబు బెదిరింపు
NEWS Jul 15,2025 03:58 pm
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు అమర్చినట్లు కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో మెయిల్ వచ్చింది. దీంతో రంగంలోకి దిగాయి బాంబ్ స్క్వాడ్ బృందాలు. భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ మెయిల్ పంపిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, సెయింట్ థామస్ స్కూల్‌లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ముందు జాగ్రత్తగా విద్యార్థులను ఖాళీ చేయించారు.