టీటీడీ ఈవో ఆఫీసుకు రాకపోతే ఎలా..?
NEWS Jul 15,2025 02:10 pm
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ టీటీడీ ఈవో జె. శ్యామల రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తను వచ్చినప్పటి నుంచి ఆఫీసులో ఉండడం లేదని మండిపడ్డారు. వర్క్ ఫర్ హోమ్ లో ఉన్నట్లు ఉందన్నారు. ఆఫీసుకు వచ్చి కూర్చోవాలని, అందుబాటులో ఉండాలన్నారు. 50 సంవత్సరాల్లో 20 మంది ఈవోలను చూశానని, కానీ ఈవో వచ్చి ఏడాది అవుతున్నా ఒక్కసారి తనను కుర్చీలో కూర్చుండగా చూడ లేదన్నారు. టీటీడీలో పని చేసే అర్చకులకు ఐదేసి సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని కోరినా పట్టించు కోవడం లేదన్నారు.