రేషన్ కార్డులపై చర్చకు సిద్దం
NEWS Jul 15,2025 01:24 pm
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలోనే 6,47,479 మంది లబ్దిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. తామేదో ఇప్పుడు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవాలను పక్కన పెట్టి అబద్దాలు చెప్పడం మంచి పద్దతి కాదన్నారు. తాము ఇచ్చిన రేషన్ కార్డులపై దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు జగదీశ్ రెడ్డి.