శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.72 కోట్లు
NEWS Jul 15,2025 10:44 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 74 వేల 149 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 66 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.72 కోట్లు వచ్చిందని తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.