ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరగాలి: సీఎం చంద్రబాబు
NEWS Jul 15,2025 10:07 am
మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, నాణ్యత కలిగిన మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.