సుంకేశుల ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత
NEWS Jul 15,2025 09:12 am
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది కర్నూలు జిల్లాలోని సుంకేశుల ప్రాజెక్టుకు. దీంతో 8 గేట్లు ఎత్తివేసి కిందకు నీళ్లు వదిలారు. ఇన్ ఫ్లో 34 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 32,224 క్యూసెక్కులు ఉంది. మరో వైపు కర్నూలు, కడప కెనాల్ కు 2012 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 0.71 టీఎంసీల వద్ద నీళ్లు ఉన్నాయి.