రూ. 6744 కోట్లతో 119 రైల్వే స్టేషన్లలో పనులు
NEWS Jul 15,2025 09:00 am
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సౌత్ సెంట్రల్ జోన్ పరిధి లోని 119 స్టేషన్లలో సుమారు రూ. 6744 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కు మార్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. వీటిలో, బేగంపేట, వరంగల్, కరీంనగర్ 3 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, పనుల నాణ్యతను తప్పకుండా నిర్ధారించాలని సూచించారు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పని ప్రదేశాలలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.