వేస్ట్ టు వెల్త్ పై ఫోకస్ పెట్టాలి - సీఎం
NEWS Jul 15,2025 08:23 am
ఓ విధానం ప్రకారం ప్రోత్సాహకాలు ఇస్తే ఆయా యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయని అన్నారు సీఎం చంద్రబాబు. దీని ద్వారా వేస్ట్ టు వెల్త్ ఎకానమీ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వ్యర్ధ రహితంగా కుప్పం మున్సిపాలిటీలో మోడల్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, దీనిని పరిశీలించాలన్నారు. పేరుకు పోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాలని ఆదేశించారు. ఘన వ్యర్ధాలను సేకరించేందుకు లాల్ పురంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ సీఎంకు తెలిపారు.