తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం
NEWS Jul 14,2025 07:20 pm
తిరుపతి రైల్యే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు బోగీల్లో మంటలు చేలరేగాయి. బీమాస్ హోటల్ వెనక భాగంలో ప్రమాదం జరిగింది. హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో రెండు బోగీల్లో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం యధావిధిగా రైళ్లు తిరుగుతున్నాయని స్టేషన్ మేనేజర్ చెన్నప్పరెడ్డి తెలిపారు.