హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు
NEWS Jul 14,2025 06:59 pm
హైడ్రా అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున బాధితులు ఆఫీసుకు చేరుకున్నారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెద్ద ఎత్తున ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. మొత్తం నగరంలోని పలు ప్రాంతాలలో చోటు చేసుకున్న భూ కబ్జాలు, ఆక్రమణలు, రహదారుల ఆక్రమణలపై 61 ఫిర్యాదులు అందాయని తెలిపింది హైడ్రా. రోజు రోజుకు హైడ్రా పనితీరుపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతోందని స్పష్టం చేసింది.