క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా బీహార్
NEWS Jul 14,2025 05:49 pm
బీహార్ క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారి పోయిందని ఆరోపించారు ఎంపీ రాహుల్ గాంధీ. రాబోయే ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మాత్రమే కాదు..రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కూడా అని అన్నారు. సీఎం నితీశ్ కుమార్ కుర్చీని కాపాడుకునే పనిలో ఉంటే మంత్రులేమో కమీషన్లకు అలవాటు పడ్డారంటూ ధ్వజమెత్తారు. ఓటు వేసే ముందు పదిసార్లు ఆలోచించాలని కోరారు. లేకపోతే డెమోక్రసీకి అర్థం అనేది ఉండదన్నారు.