ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
NEWS Jul 15,2025 06:33 am
వివిధ హోదాలో పనిచేస్తున్న ఐదుగురు నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు. ఊరు కన్నా పోరు మిన్న అవగాహన కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ కల్పిస్తున్న పునర్వాస సదుపాయాల గురించి నక్సల్స్ తెలుసుకొని లొంగిపోతున్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ సహాయం కింద ₹25,000 రూపాయల నగదును ఎస్పీ శబరీష్ అందజేశారు.