కృష్ణా, గోదావరి జలాలపై దృష్టి పెట్టాం
NEWS Jul 14,2025 04:23 pm
నాగార్జున సాగర్ రెండో జోన్‌కి నీటిని విడుదల చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృష్ణ, గోదావరి జలాల వాటాపై సర్కార్ దృష్టి సారించిందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులకు ఇబ్బంది ఉందన్నారు. రాయలసీమ వద్ద ప్రాజెక్టు కట్టుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణలో ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ప్రకటించారు.