ఐటీనీ తీసుకు వచ్చింది చంద్రబాబు కాదు
NEWS Jul 14,2025 04:29 am
వైసీపీ సీనియర్ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఐటీని తాను తీసుకు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భూకంపాల తాకిడి లేని హైదరాబాద్ లో డేటాను నిల్వ చేసేందుకు సురక్షిత ప్రాంతమని ఆనాడు పీఎం పీవీ సూచించారని తెలిపారు. దీంతో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సైబర్ టవర్ కు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. ఐటీ సంస్థలు వచ్చాయని, ఇవన్నీ పక్కన పెట్టి తానే చేశానని చెప్పుకోవడం తగదన్నారు.