స్పేస్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్
NEWS Jul 14,2025 04:14 am
ఏపీ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంతరిక్ష ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదారులకు ఈ కార్పొరేషన్ సాయం చేస్తుందని వెల్లడించారు. మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం నెలకొల్పుతామన్నారు. శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.