టీటీడీలో దాదాపు 1000 మందికి పైగా అన్యమతానికి చెందిన ఉద్యోగస్తులు ఉన్నట్లు తమ సర్వేలో తేలిందన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ చేసిన కామెంట్స్ వాస్తవమేనని అన్నారు. ఇందుకు సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు సత్య దూరమన్నారు. ఇంటింటి సర్వే చేసి అన్యమతస్తులు ఎవరెవరు పని చేస్తున్నారని గుర్తించి తొలగిస్తామన్నారు.