ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి - జోగిని
NEWS Jul 14,2025 04:02 am
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు సూపర్ సక్సెస్ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు జోగిని వైష్ణవి. ఎలాంటి తోపులాటలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారంటూ కితాబు ఇచ్చారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. తమకు పెన్షన్లు, సొంత ఇళ్లు అవసరం లేదన్నారు. భక్తితో చేసిన బోనం అమ్మ వారికి చేరితే చాలన్నారు. బోనాల సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు బోనాలు సమర్పించారు.