మల్లన్నపై శాసన మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు
NEWS Jul 13,2025 03:41 pm
తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా, కించపరిచేలా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కమిటీ ఆన్ ఎథిక్స్ కు రెఫర్ చేయాలని కోరుతూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గౌరవ చట్ట సభలో సభ్యుడిగా ఉన్న మల్లన్న తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఒక మహిళ అన్న గౌరవం లేకుండా సభ్య సమాజం తల దించుకునేలా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నించారు.