ఒక కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌తో కవితకు ఏం సంబంధం..? మీకు మాకు ఏమైనా కంచం పొత్తా.. మంచం పొత్తా.. అంటూ మల్లన్న వ్యాఖ్యానించారు. మేం రిజర్వేషన్లు అమలు చేస్తుంటే.. మీరు పండగ చేసుకోవడం ఏంటో అర్థం కావడంలేదంటూ మల్లన్న ప్రసంగించారు. ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై భగ్గుమన్న జాగృతి శ్రేణులు.. ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ కొనసాగుతోంది.