ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మల్లన్న చేయికి గాయం కాగా తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో జాగృతి కార్యకర్త సాయికి భుజం నుంచి బుల్లెట్ వెళ్లింది. ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. నేరుగా తుపాకీతో కార్యకర్తలపై కాల్పులు జరపడం కలకలం రేపింది.