పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS Jul 13,2025 08:10 am
గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 41.1 అడుగులుగా ఉండగా ధవళేశ్వరం వద్దకు భారీగా నీళ్లు చేరుతున్నాయి. ప్రస్తుతం ఇన్, అవుట్ ఫ్లో 5.29 క్యూసెక్కులు ఉంది. కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖల్ జైన్ . తుంగభద్ర నదిలో గల్లంతైన వారి కోసం సెర్చ్ కొనసాగుతోందని తెలిపారు.