ఏపీకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు
NEWS Jul 13,2025 04:02 am
స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కాయి. ఈ కేటగిరీ కింద పలు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈనెల 17న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారు మంత్రి నారాయణ. విజయవాడ, గుంటూరు, తిరుపతి, గ్రేటర్ విశాఖపట్నం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు ఆయా కేటగిరీలో కింద ఎంపికయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.