కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశాడు. తనకు మంత్రి పదవి కావాలని అన్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారో లేక జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారో మీరే తేల్చుకోవాలన్నారు. యాదవుల్లో తనకంటే బాగా పార్టీకి సేవ చేసిన వాళ్లు ఎవరున్నారంటూ ప్రశ్నించారు. మల్లికార్జున్ ఖర్గేకి కూడా ఇదే విషయం చెప్పానని స్పష్టం చేశారు.