వైఎస్సార్ ఆర్కిటెక్చర్ విద్యార్థులకు న్యాయం చేయాలి
NEWS Jul 13,2025 07:26 am
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. విజయవాడలోని సీఓఏ ఉన్నతాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత జగన్ రెడ్డి సర్కార్ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వారి కారణంగా ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిషన్ లేకుండానే యూనివర్శిటీని స్టార్ట్ చేయడం వల్లే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.