బెస్తవారిపేట మండలం చింతలపాలెం సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఓబయ్య అక్కడికక్కడే మృతి చెందగా అతని భార్య జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.