ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ. 600 కోట్లు రిలీజ్ చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ప్రకటించింది ఉన్నత విద్యా శాఖ. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ. 788 కోట్లు చెల్లించింది. త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామని విద్యా శాఖ కార్యదర్శి ప్రకటించారు.