వేద పండితులకు రూ.3వేల గౌరవ వేతనం
NEWS Jul 12,2025 03:13 pm
తిరుమలలో టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేవాదాయ చట్టం ప్రకారం 9 శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవచ్చని నిబంధనలు ఉన్నాయని అన్నారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి. అర్చక నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 590 మంది మొత్తం వేదపండితులు ఉన్నారని వారికి గౌరవ వేతనం కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారనేది వాస్తవమేనని స్పష్టం చేశారు.