తెలంగాణలో కల్లు కాంపౌండ్లపై దాడులు
NEWS Jul 12,2025 05:56 pm
ఎక్సైజ్ శాఖ తెలంగాణ వ్యాప్తంగా శనివారం కల్లు కాంపౌండ్లపై దాడులు చేపట్టింది. కల్లు కాంపౌండ్ల నిర్వహణ, అమ్మకాలను పరిశీలించింది. నగర పాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న కల్లు కాంపౌడ్లపై సోదాలు నిర్వహించింది. మూడు కల్లు కాంపౌండ్లను సీజ్ చేసింది. ముషీరాబాద్ ఏరియాలో ఎలాంటి అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్లను నిర్వహవిస్తున్నట్ల గుర్తించింది. ఇప్పటికే కల్తీ కల్లు తాగి పలువురు మృతి చెందారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు సర్కార్.