RCB విక్టరీ పరేడ్ ఘటనలో వారిదే బాధ్యత
NEWS Jul 12,2025 09:14 am
బెంగళూరులో చోటు చేసుకున్న ఆర్సీబీ విక్టరీ పరేడ్ ఘటనపై పూర్తి నివేదికను జ్యుడీషియల్ కమిషన్ సీఎం సిద్దరామయ్యకు అందజేసింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్( KSCA), ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదిక ఇచ్చింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయాలు అయ్యాయి.