బనకచర్లకు పర్మిషన్ రాదని బాబుకు తెలుసు
NEWS Jul 12,2025 02:18 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బనకచర్ల ప్రాజెక్టుపై స్పందించారు. సీఎం చంద్రబాబు కావాలని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వచ్చారని ఆరోపించారు. దీనికి పర్యావరణ, అటవీ శాఖ అనుమతి ఇవ్వదని ముందే తెలుసన్నారు. కావాలని తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తెరపైకి తీసుకు వచ్చారన్నారు. ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టాలన్నారు. హంద్రీ నీవా, గాలేరు నగరి గురించి పల్లెత్తు కూడా మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.