బనకచర్ల నీటి మళ్లింపు ఒప్పుకోం - GRMB
NEWS Jul 12,2025 09:18 am
బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనపై గోదావరి నది నిర్వహణ బోర్డు (జీఆర్ఎంబీ) తీవ్ర అభ్యంతరం తెలిపింది. గోదావరి, కృష్ణా జలలా నుంచి 200 టీఎంసీలు తీసుకు వెళ్లాలని డీపీఆర్ తయారు చేసింది ఏపీ సర్కార్. అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్. గోదావరికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా ఇరు రాష్ట్రాలు ఒక ఒప్పందానికి రావాలని సూచించింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ), గోదావరి నదీ నిర్వహణ బోర్డు. నీటిని బనకచర్లకు మళ్లిస్తే, ప్రాజెక్టు ప్రస్తుత ఆపరేషన్ మారే ప్రమాదం ఉందని పేర్కొంది.