ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. తక్షణమే కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. నెలకు రూ. 26 వేల వేతనం ఇవ్వడంతో పాటు పని సమయం 8 గంటలకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.