అహ్మదాబాద్ లో కూలి పోయిన విమాన ఘటనకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా. ఇంధన కంట్రోల్ స్విచ్ లో లోపాలు తలెత్తినట్లు ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. దీనికి సంబంధించి స్పందించింది ఎయిర్ ఇండియా. విచారణకు తమ వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేసింది. విమాన ప్రమాదంలో మృతుల చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని విచారం వ్యక్తం చేసింది.