తిరుమలలో పోటెత్తిన భక్తజనం
NEWS Jul 12,2025 08:38 am
తిరుమల భక్త బాంధవులతో కొట్టుమిట్టాడుతోంది. శ్రీవారిని 70 వేల 217 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 155 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చిందని తెలిపారు ఈవో జె. శ్యామలరావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలా తోరణం వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలు పడుతుందని వెల్లడించారు.