'పేదలకు అండగా సీఎం సహాయ నిధి'
NEWS Jul 12,2025 04:17 pm
మెట్‌పల్లి: అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నపేద, మధ్య తరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆదుకుంటోందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. జువ్వాడి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మెట్‌పల్లి ప్రాంతానికి చెందిన వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 18 లక్షల 63 వేల రూపాయలు విలువగా 54 చెక్కులను జువ్వాడి పంపిణీ చేశారు.