జనాభా భారం కాదు..అది తిరుగులేని ఆస్తి
NEWS Jul 11,2025 02:13 pm
జనాభా ఎప్పటికీ భారం కానే కాదని, అదే మనకు తిరుగులేని ఆస్తి అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అభివృద్ధి సాధ్యమా అనే పరిస్థతి నుంచి ఆ జనాభానే మనకు అడ్వాంటేజ్‌గా మారిందన్నారు. 140 కోట్ల జనాభా కలిగి ఉన్న మన దేశం చైనాను కూడా వెనక్కు నెట్టేసిందన్నారు. భారత్ అతి పెద్ద మూడో ఆర్థిక శక్తిగా అవతరించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభాతో పాటు జననాల రేటు తగ్గి పోతోందని ఆవేదన చెందారు. యువ శక్తి తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.