బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి గ్రామస్తుల స్వాగతం
NEWS Jul 11,2025 11:55 am
ప్రకాశం జిల్లా కొండేపి లో వైసీపీ నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి,వైసిపి రాష్ట్ర నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, రోజా, ఆదిమూలపు సురేష్,శివప్రసాద్ రెడ్డి, వెంకాయమ్మ తోపాటు ప్రముఖులు హాజరయ్యారు. వీరికి కొండేపి మండలం మిట్టపాలెం గ్రామం ఉప సర్పంచ్ మండవ మాలకొండయ్య,ఘన స్వాగతం పలికారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు భారీగా హాజరయ్యి జేజేలు కొట్టారు.