బీజేపీ హై కమాండ్ కీలక ప్రకటన చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన రాజీనామాను ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ లేఖ ద్వారా రాజా సింగ్ కు తెలిపారు. తను పేర్కొన్న కారణాలు పార్టీ సిద్దాంతాలకు, పని తీరుకు విరుద్దంగా ఉందన్నారు. ఆయన లేవదీసిన అంశాలు అసంబద్దంగా ఉన్నాయన్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సిఫార్సు ఆధారంగా పార్టీ రాజీనామాను ఆమోదించాలని నిర్ణయించిందన్నారు.