రాష్ట్రంలో జనాభా పెరుగుదలపై ఫోకస్ పెట్టాం: చంద్రబాబు
NEWS Jul 11,2025 03:38 pm
మన దేశానికి అతి పెద్ద ఆర్థిక వనరు జనాభా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో జనాభా పడిపోతోందని చెప్పారు. అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం అని అన్నారు. మన దేశ జనాభా 143 కోట్లు కాగా... చైనా జనాభా 130 కోట్లు అని చెప్పారు. అమెరికాలో ఫర్టిలిటీ రేటు 1.62 శాతం మాత్రమేనని.... 2.1 శాతం ఫర్టిలిటీ రేటు ఉంటేనే రీప్లేస్ మెంట్ ఉంటుందని... లేకపోతే రోజురోజుకూ జనాభా తగ్గిపోతుందని తెలిపారు.