వాలంటీర్ వ్యవస్థ వల్లే ఓడి పోయాం
NEWS Jul 11,2025 01:48 pm
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాలంటీర్లపై సంచలన ఆరోపణలు చేశారు. తమ నాయకుడు జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకు రావడం వల్ల తమ పార్టీకి తీరని నష్టం జరిగిందని వాపోయారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, వారు లేకుంటే మేం లేమన్నారు. వాలంటీర్ వ్యవస్థను నమ్ముకోవడం వల్లనే తమకు షాక్ తగిలిందన్నారు. ప్రజలు, పాలకులకు మధ్య కార్యకర్తలను ఉంచాలన్న విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.