టీటీడీలో అన్యమతస్తులు ఉండొద్దు - బండి
NEWS Jul 11,2025 11:43 am
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. టీటీడీలో అన్యమతస్తులు ఎవరున్నా వెంటనే తొలగించాలని అన్నారు. ఇతరులు ఎవరున్నా ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. పురాతన ఆలయాలను గుర్తించి నిధులు కేటాయించాలని కోరారు. కొండగట్టు, వేములవాడ, ఇల్లందు రామాలయానికి టీటీడీ నిధులు ఇవ్వాలని అన్నారు. ఓటు రాజకీయాలకు టీటీడీ వేదిక కాకూడదన్నారు.