భూములు కబ్జా అయితే నోరు మెదపని బీజేపీ చీఫ్
NEWS Jul 11,2025 11:34 am
భద్రాచలం ఆలయ భూముల కబ్జాపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడి భూములు కబ్జా అయినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 889 ఎకరాలను ఆక్రమించుకుంటే ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. రాజకీయ పొత్తులు పక్కన పెట్టి భద్రాచలం దేవస్థానం భూములను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా చూడాలన్నారు.